BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 14 August 2026, 05:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆసుపత్రి టాయిలెట్‌లో నర్సు అనుమానాస్పద మృతి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 05:56 AM
94 వీక్షణలు

ఆసుపత్రి టాయిలెట్‌లో నర్సు అనుమానాస్పద మృతి

కోల్‌కతా: ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కోల్‌కతాలో కలకలం రేపింది. నీల్‌రతన్ సిర్కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగంలో పనిచేస్తున్న రూపాలి బర్మన్ బుధవారం రాత్రి విధులకు హాజరైంది.

రాత్రి సుమారు 10.20 గంటల సమయంలో హెచ్‌డీ విభాగంలోని టాయిలెట్‌కు వెళ్లిన రూపాలి చాలాసేపటికీ తిరిగి రాలేదు. దీంతో సహచర నర్సులు ఆమెను పిలిచినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. చివరకు టాయిలెట్ తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా రూపాలి నేలపై అపస్మారక స్థితిలో కనిపించింది.

వెంటనే ఆమెను ట్రాలీపై ఆసుపత్రి చికిత్స విభాగానికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించే సమయానికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రస్తుతం రూపాలి మృతికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది తెలియరాలేదు. ఆత్మహత్య కోణంలో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. టాయిలెట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ ఆమెకు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనను ఆరోగ్య శాఖ తీవ్రంగా పరిగణించింది. సంఘటనపై ప్రత్యేక విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు, సీసీటీవీ దృశ్యాల పరిశీలన పూర్తయిన తర్వాతే నర్సు మృతికి అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.