ఏకశిలలో టైటిల్ టెన్షన్ !
ఏకశిలలో టైటిల్ టెన్షన్ !
- సర్కిల్ కు చేరిన ఎల్ఆర్ఎస్ వివాదం
- లింక్ డాక్యుమెంట్స్
చూపించాలన్న మున్సిపల్ అధికారల - తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన అసోసియేషన్ సభ్యులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెములలోని ఏకశిల వెంచర్లో ప్లాట్లు కొన్న వారికి మరో రియల్ వ్యాపారి మధ్య నెలకొన్న వివాదంలో ఇటీవల సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 20 ఏళ్ల క్రితం ప్లాట్లను కొన్న వారికి టైటిల్ సమస్య ఎదురైంది. భూ యజమానుల నుంచి జీపీఏ తీసుకున్న వారితో కుమ్మక్కై కొందరు రియల్టర్లు సర్వే నంబర్లను తప్పుగా వేసి డాక్యుమెంట్లు చేయించి అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్లాట్ల కొనుగోలుదారులు తమ ప్లాట్లలోకి వెళ్ల లేక ఏకశిల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను ఆశ్రయించినా ఫలితం పోతోందని నిట్టూరుస్తున్నారు. ఇటీవల ఎలా ఆర్ఎస్, గృహ నిర్మాణాలకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోగా మున్సిపల్ అధికారులు లింక్ డాక్యుమెట్లు, టైటిల్ ఆధారాలు చూపించాలని అడగడంతో దిక్కు తోచని పరిస్థితులు అసోసియేషన్ సభ్యులు బయటకు వచ్చేసినట్లు తెలిసింది. దీంతో అసోసియేషన్ సభ్యులు కొందరు ఆడుతున్న రియల్ దందా నాటకంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఏకశిల వెంచర్ వివాదంలో ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, హైడ్రా అధికారులు తలదూర్చి తలవొంపులు తెచ్చుకున్న విషయం చర్చకు వచ్చింది.
64 ఎకరాల్లో ఏకశిలా నగర్
1987 సంవత్సరంలో కొర్రెముల రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 743, 744, 745, 746, 747లలో దాదాపు 64.36 ఎకరాల్లో భూస్వాములైన చెరుకు దశరథ, మునుకుంట్ల లచ్చయ్య గౌడ్ తదితరులు గ్రామపంచాయతీ లేఅవుట్కు ప్రణాళికలు సిద్ధం చేసు కున్నారు. ఈ క్రమంలో చెరుకు దశరథ కుటుంబీకులు సర్వే నంబర్ 746లో 9.12 ఎకరాలు సుందర మూర్తి, నంద్యాల ప్రభాకర్ రెడ్డికి రిజిస్టర్ జీపీఏ (816/86) ఇచ్చారు. 743లో ఆరు ఎకరాలు (డాక్యుమెంట్ నంబర్ 2409/87), 2.23 ఎకరాలు (2597/87). 74లో 6.05 ఎకరాలు (5379/87), 745లో 5.06 ఎకరాలు (4369/87) ప్రతాపరెడ్డి పేరున సేల్ డీడ్ చేయగా, 747 సర్వే నంబర్లో మూడు ఎకరాల భూమిని నంద్యాల ప్రభాకర్ రెడ్డి పేరున రిజిస్టర్ జీపీఏ (260/87) చేశారు. అయితే మునుకుంట్ల య్య గౌడ్ కుటుంబీకులు సర్వే నంబర్ 743లో 8.34 ఎకరాలు రిజిస్టర్ జీపీఏ (79/87), 744లో 6.05 ఎకరాలు, 745లో 5.06 ఎకరాలు, 747లో మూడు ఎకరాలు రిజిస్టర్డ్ జీపీఏ (254/87), 746లో 9.12 ఎకరాలు నంద్యాల ప్రభాకర్ రెడ్డి, సుందర మూర్తి పేరున రిజిస్టర్ జీపీఏ (817/86) చేశారు. మొత్తంగా రెండు కుటుంబాల భూ యజమానులు దాదాపు 64 ఎకరాల విస్తీర్ణం భూమిని లేఅవుట్ చేసేందుకు ప్రతాపరెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు. లేఅవుట్ రద్దయింది ఇలా...
సర్వే నంబర్ 743, 744, 745, 746, 747లలో 64 ఎకరాల భూమిని చేసేందుకు రిజిస్టర్ జీపీఏ, సేల్ డీడ్ చేసుకున్న ప్రతాపరెడ్డి, ప్రభాకర్ రెడ్డి సర్వే నంబర్ 739 నుంచి నంబర్ 749లను తప్పుగా నమోదు చేసి అక్రమంగా అదనపు ప్లాట్లు విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకున్న భూస్వాములు వారికి ఇచ్చిన రిజిస్టర్ జీపీఏ 816/86లో 9.12 ఎకరాలు, 260/87లో
మల్కాజిగిరి నగర పాలక సంస్థ
మల్కాజ్ గిరి నగరపాలక సంస్థకు తరలివచ్చిన బాధితులు.
నమ్మినవారే మోసం చేశారు.
ప్లాట్లకు లింక్ డాక్యుమెంట్లు చూపించాలని ఏకశిలా నగర్ కాలనీ అధ్యక్షుడు శివారెడ్డిని ఘట్ కేసర్ సర్కిల్ ఏసీపీ (అసిస్టెంట్ సిటీ ప్లానర్) శ్రీధర్ ప్రశ్నించారు. దీన్ని తట్టుకోలేని శివారెడ్డి అధికారులను దబాయించే ప్రయత్నం చేశారు. పోలీసులను పిలిపించి అరెస్టు చేయించాల్సి వస్తుందని ఏసీపీ హెచ్చరించారు. మున్సిపల్ అధికారుల వద్ద ఏం సమాధానం చెప్పలేని శివారెడ్డి తోక ముడిచి బయటకు వచ్చినట్లు సమాచారం. మున్సిపల్ అధికారులు కావాలని టైటిల్ డీడ్ పేరుతో సమస్యలు సృష్టిస్తున్నారని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసి, ఇదే విషయాన్ని పత్రికల్లో ప్రకటించారు. కానీ శివారెడ్డి తీరును పసిగట్టిన కొందరు ప్లాటు కొనుగోలుదారులు తాము సంవత్సరాల కాలాన్ని, లక్షల రూపాయల కష్టార్జితాన్ని నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని పత్రికల ద్వారా బయటకు తెలియజేస్తామని చెప్పారు.
మూడు ఎకరాలను (469/90, 468/90) ద్వారా రద్దు చేసి 20/08/1991లో ఏడీ సర్వే (జీ7/2784/89) చేసి హద్దులు నిర్ధారించి 2004లో అప్పటి జిల్లా పంచాయతీ అధికారిని సంప్రదించగా, 2006 డీపీఓ రంగారెడ్డి ఏకశిల వెంచర్ లేఅవుట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు (బీ2/4480/2005) జారీ చేశారు. దీనిపై అప్పట్లో ఏకశిల ప్లాట్ ఓనర్స్ అసోసి యేషన్ హైకోర్టును (డబ్ల్యూపీ నంబర్ 8859/2008) ఆశ్రయించగా, మరో సారి పునర్విచారణ జరపాలని కోర్టు ఆదేశాల మేరకు డీపీవో క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి ఏకశిల లేఅవుట్ను రద్దు చేస్తూ రెండోసారి ఉత్తర్వులు (4480/2005 B1 (pts) జారీ చేశారు. ఆ తర్వాత సర్వే నంబర్ 739 నుంచి 749 వరకు
అసోసియేషన్కు అన్నీ ఎదురు దెబ్బలే
2007లో ఏకశిల అసోసియేషన్ సభ్యులు వీరభద్ర రావు మరో ముగ్గురు ఇంజక్షన్ ఆర్డర్ కోసం జూనియర్ అదనపు సివిల్ జడ్జి రంగారెడ్డి కోర్టులో వేసిన పిటిషన్ (ఓఎస్ నెంబర్ 700/2007) వేయగా 2010లో డిస్మిస్ అయ్యింది. ఇదే విధంగా 2009లో జుబేర్ అక్రం (న్యాయవాది) ఇంజక్షన్ ఆర్డర్ కోసం 1వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి రంగారెడ్డిలో వేసిన పిటిషన్ (ఓఎస్ నెంబర్ 281/2008) వేయగా 2015లో డిస్మిస్ అయ్యింది. ఇదే క్రమంలో మరో 12 మంది ఇంజక్షన్ ఆర్డర్ కోసం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రంగారెడ్డి కోర్టులో 2007లో వేసిన పిటిషన్ ఓఎస్ నెంబర్ (627/2007) 2013లో డిస్మిస్ అయ్యింది. చివరగా ఏకశిల నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకు శివారెడ్డి, సామిరెడ్డి, ఆర్షియా అక్రమ్ పట్టు వీడకుండా 2009లో ప్రిన్సిపల్
ఉన్న భూమిలో ఎల్ఆర్ఎస్ ఆమోదించవద్దని, గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా శ్రీహర్ష కన్స్ట్ర క్షన్ ప్రతినిధి హైకోర్టును ఆశ్రయించగా, అతనికి అను కూలంగా హైకోర్టు ఉత్తర్వులు (డబ్ల్యూపీ నంబర్ 25165/2009) ఇచ్చింది. ఆ తర్వాత 2006లో భూ యజమానులు లచ్చయ్య గౌడ్, దశరథ గౌడ్ ఏకశిల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, ఏకశిల నగర్ వెంచర్ నిర్వాహకులు ప్రతాపరెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపై డిక్లరేషన్ సూట్ 3వ అదనపు జిల్లా కోర్టులో ఓఎస్ నెంబర్ 64/2004 ను చేయగా, సర్వే నంబర్ 739 నుంచి 742 వరకు వారికి ఎలాంటి సంబంధం లేదని ప్రమాణ పత్రం సమర్పించారు. దీంతో లోక్ అదాలత్లో పర్పెచువల్ ఇంజంక్షన్ ఆర్డర్ హర్దా కన్స్ట్ర క్షన్ వెంకటేశ్ పేరున ఇచ్చారు. లోక్ అదాలత్లో పర్పె చువల్ ఇంజంక్షన్ ఆర్డర్లను చాలెంజ్ చేస్తూ 2009లో ఓ వ్యక్తి హైకోర్టు డివిజనల్ బెంచ్న ఆశ్రయించగా డిస్మిస్ చేస్తూ (డబ్ల్యూపీఎస్ఆర్ 8036/2009) ఉత్తర్వులు జారీ చేసింది.
న్యాయ స్థానంలో ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్కు వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చినా రియల్ బ్రోకర్లు అమాయక ప్రజలకు ప్లాట్లు విక్రయిస్తూ అక్రమ దందా చేస్తూనే ఉన్నారు. వీలైనప్పు డల్లా జుబేర్ అక్రం (న్యాయవాది) కోర్టులో కేసులు వేస్తూ దాదాపు 20 ఏళ్ల పాటు అమాయక ప్రజలను అయోమయానికి గురి చేస్తూ కాలయాపన చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నాడని ఇటీవల చర్చకు వచ్చింది. ఏకశిలా వెంచర్ సర్వే నంబర్ 743 నుంచి 747లలో ఏర్పాటైనట్లు టైటిల్ డీడ్ ఉండగా, సర్వే నంబర్ 739 నుంచి 749 వరకు ఉన్న డాక్యుమెంట్లకు ఎస్ఆర్ఎస్ ఆమోదించాలని, గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలంటూ ఏకశిలా నగర్ కాలనీ అధ్యక్షుడు శివారెడ్డి ఆధ్వర్యంలో ఘట్కేసర్ డిప్యూటీ కమిషనర్కు చేసిన దరఖాస్తులపై టైటిల్ వివాదం తలెత్తింది.
CASHILA NAGAR PLOT OWNER'S
WELFARE ASSOSICATION. LEGD No. 2256/06) ఏకశిల నగర్ పాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేష (SY.No. 739 TO 749)
4.No:3-1482. ROAD NOL.BASANAGAK. NAKAPALLY Wal- 1-9866505842. 9866897227. 9949648929.
OFFICE
సీనియర్ సివిల్ జెడ్ ఎల్బీనగర్ కోర్టులో సర్వే నంబర్ 739 నుంచి 742లో డాక్యుమెంట్లు, ఓఎస్ నంబర్ 64/2004 ను రద్దు చేయాలని పిటిషన్లు, 1494/ఏ ప్లాటుకు ఇంజక్షన్ ఆర్డర్ కోసం వేసిన డిక్లరేషన్ సూట్ (ఓఎస్ నెంబర్ 1399/2009) డిస్మిస్ చేస్తూ 743 సర్వే నంబర్ 1257,1620 739 నుంచి 742 లేనందున ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.