BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 12 August 2026, 03:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అక్కపాలెంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఆర్డీఓ పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Aug, 2026 - 03:05 PM
63 వీక్షణలు

అక్కపాలెంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఆర్డీఓ పరిశీలన

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం అక్కపాలెం రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. గ్రామంలోని ఆర్‌ఎస్ నెం. 3-1లో ఉన్న 1.80 సెంట్ల ప్రభుత్వ భూమిని బాయన సాంబశివరావు, తోటకూర సత్యవతి అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆక్రమణలను తొలగించి భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు. ఆక్రమిత భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు అవసరమైన తదుపరి చర్యలు వెంటనే చేపట్టాలని తిరువూరు తహసీల్దార్‌కు సూచించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ప్రజలు స్పందిస్తూ.. గ్రామంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, మండల సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి పాల్గొన్నారు.