BREAKING
thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం
Test 4
Date of Publish : 19 September 2026, 06:43 pm
Posted by : SEETHA KIRAN KUMAR

డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి అలర్ట్..

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Sep, 2026 - 06:43 PM
54 వీక్షణలు

మొబైల్ నంబర్ అప్‌డేట్ చేశారా?
ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్

Ntoday News: డ్రైవింగ్ లైసెన్స్‌దారులు తమ లైసెన్స్‌కు యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని రవాణా శాఖ సూచించినట్లు సమాచారం. ఈ-చలాన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ఇతర డిజిటల్ రవాణా సేవల సమాచారాన్ని నేరుగా పొందేందుకు మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవడం ఉపయోగపడుతుంది.

మొబైల్ నంబర్ మారిన వారు తమ డ్రైవింగ్ లైసెన్స్ రికార్డుల్లో కొత్త నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు సమాచారం.

మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం సారథి పరివాహన్ పోర్టల్‌లోకి వెళ్లి సంబంధిత రాష్ట్రాన్ని ఎంచుకుని, అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసి కొత్త మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్‌దారులు తమ మొబైల్ నంబర్ ప్రస్తుతం సరిగ్గా నమోదై ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోవాలని, డిజిటల్ రవాణా సేవలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో పొందేందుకు వివరాలను అప్‌డేట్‌గా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.