రెట్టింపు డబ్బులు ఇస్తానంటూ మోసం చేశారనే ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
మర్రిపూడి: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వేమవరం, గార్లపేట గ్రామాలకు చెందిన పలువురు ఓ పాస్టర్ చెప్పిన మాటలను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లక్ష రూపాయలు ఇస్తే రూ.2 లక్షలు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ రెండు గ్రామాల్లోనే సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే కనిగిరి మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే తరహాలో డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యవహారంపై ప్రస్తుతం కనిగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు దర్యాప్తులో ఉన్నట్లు సమాచారం. వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధితుల సంఖ్య, వసూలైన మొత్తం తదితర అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.