BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 06:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు చిరంజీవి బస్టాండ్ వద్ద అక్రమ మద్యం విక్రయాల ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 06:40 AM
31 వీక్షణలు

యరకల సూరిబాబుపై చర్యలు తీసుకోవాలని స్థానికుల ఆందోళన

జనావాసాల మధ్య మద్యం వ్యాపారానికి ఏర్పాట్లు చేస్తున్నారంటూ నిరసన.. పాఠశాలలు, దేవాలయాలు, ఆసుపత్రుల సమీపంలో దుకాణం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్న ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరిక

ఏలూరు: నగరంలోని జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్నారంటూ యరకల సూరిబాబుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని వన్‌టౌన్ దక్షిణపు వీధి, జ్వాలా పహారేశ్వర స్వామి కాలనీ పరిధిలో చిరంజీవి బస్టాండ్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు పుప్పాల కన్నబాబు నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ.. యరకల సూరిబాబు గతంలో మద్యం వ్యాపారం నిర్వహిస్తూ స్థానిక ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగించారని ఆరోపించారు. ఒక లైసెన్సుతో అనేక ప్రాంతాల్లో అనధికార బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు సాగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఏళ్ల తరబడి రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటూ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా స్థానికులంతా ఏకమై అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయిందని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటూ తిరిగి అదే ప్రాంతంలో మద్యం విక్రయ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పూటకో రాజకీయ పార్టీ మారుతూ రాజకీయ సంబంధాలను వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. విద్యా, ఆధ్యాత్మిక సంస్థల సమీపంలో మద్యం విక్రయాలా? చిరంజీవి బస్టాండ్ సమీపంలోని ప్రతిపాదిత ప్రాంతం చుట్టూ అనేక విద్యా, ఆధ్యాత్మిక, వైద్య సంస్థలు ఉన్నాయని స్థానికులు వివరించారు. జ్వాలా పహారేశ్వర స్వామి దేవాలయం, దక్షిణపు వీధిలోని మార్కండేయ స్వామి ఆలయం, వడ్డెర గూడెం రామాలయం, జ్వాలా పరమేశ్వర మున్సిపల్ పాఠశాల, వెంకటేశ్వర నగరపాలక ప్రత్యేక ప్రాథమిక పాఠశాల, హజరత్ పాషా షాహీద్ దర్గా, లాంప్ ఆఫ్ ప్రేయర్ గాడ్ హౌస్, జేపీ కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో మద్యం విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కైకలూరు మినీ బైపాస్ రహదారిని ఆనుకుని ఉన్న ఇరుకైన ప్రదేశంలో కంటైనర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు సాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నాయని, రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవించే కుటుంబాలపై అక్రమ మద్యం విక్రయాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం విక్రయాలతో ప్రశాంతత కరువు గతంలో చేపల చెట్టు సెంటర్‌లో సుమారు 30 ఏళ్లుగా తన తండ్రితో కలిసి మద్యం దుకాణం నిర్వహిస్తూ పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలిగించారని సూరిబాబుపై స్థానికులు ఆరోపించారు. నిర్ణీత వేళలు పాటించకుండా రాత్రంతా మద్యం విక్రయాలు సాగించడంతో స్థానికులకు ప్రశాంతత లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక కొందరు తమ సొంత ఇళ్లను సైతం విక్రయించి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలి ప్రజల ఆరోగ్యం, కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జనావాసాల మధ్య మద్యం విక్రయ కేంద్రం ఏర్పాటు చేసే ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడికి ప్రాధాన్యం ఇవ్వకుండా వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్, పోలీసు, నగరపాలక సంస్థ అధికారులు కోరారు. అనుమతులు, నిబంధనలను పరిశీలించి అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయనివ్వబోమని, ప్రజలంతా ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఆందోళనకారులు స్పష్టం చేశారు.