రాయల చెరువు కబ్జాకు అడ్డుకట్ట వేసిన కూటమి నాయకులు..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా..
పుంగనూరు.
రాయల చెరువు ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.. కూటమి నాయకులు
పుంగనూరు మండలంలోని రాయల చెరువు కబ్జాకు గురవుతున్న విషయాన్ని తహసీల్దార్ రాము దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్ తెలిపారు. ఈ సందర్బంగా కూటమి నాయకులు మాట్లాడుతు
పట్టణం లోని చెరువులను పూడ్చి భూమి ఆక్రమించి కబ్జా కు గురి అవుతున్నాయని తహసీల్దార్ కి తెలియజేసిన వెంటనే ఆయన స్పందించి, ఆర్ ఐ, వి ఆర్వో సర్వేయర్ లని సంఘటనా స్థలానికి పంపించి అక్రమ కట్టడాలు గుర్తించి తొలగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో BJP టౌన్ ప్రెసిడెంట్ జగదీష్ రాజు తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.