BREAKING
thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ
Date of Publish : 04 October 2026, 07:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం పెనుగొలనులో రెండో రోజు కొనసాగిన సేవా సంకల్ప్ అభియాన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 07:10 AM
42 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 98, 99వ అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం రెండో రోజు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల పోషణ, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ఏఎన్‌ఎం రత్నమాల మాట్లాడుతూ అన్ని వయసుల వారు కాలానుగుణ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిన్నారులకు సమగ్ర పోషణ అందించడం, గర్భిణులు, బాలింతలు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమని వివరించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

అనంతరం అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి, సేవలందించడంలో చూపిన కృషిని గుర్తిస్తూ 98వ అంగన్వాడీ కేంద్రానికి చెందిన సిబ్బంది బి. నాగమణి, ఏసు మణి, 99వ అంగన్వాడీ కేంద్రానికి చెందిన కె. లింగమ్మ, డి. రామాంజనమ్మలను మహిళలు ఘనంగా సన్మానించారు. అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అభినందించారు.