BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 02 October 2026, 10:24 pm
Posted by : THUNIKI NAGARAJU

ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
Thuniki Nagaraju రాయికల్ మండల ప్రతినిధి
02 Oct, 2026 - 10:24 PM
33 వీక్షణలు
రాయికల్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘అంగన్ మిలన్ సేవ’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ బోగ శ్రావణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని బోగ శ్రావణి తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించిన ఆమె చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో మాట్లాడి కేంద్రాల్లోని వసతులు, చిన్నారులకు అందుతున్న పోషకాహారం, ఇతర సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మిషన్ సాక్షం అంగన్‌వాడీ అండ్ పోషణ్ 2.0’ ద్వారా అంగన్‌వాడీ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు చిన్నారులకు పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య–పోషకాహార అవగాహన, ఆరోగ్య పరీక్షలు, టీకాలు, అవసరమైన వారికి రిఫరల్ సేవలు అందిస్తున్నట్లు కార్యక్రమంలో వివరించారు.

కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షుడు ఆకుల మహేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, జిల్లా మహిళా మోర్చా కోశాధికారి గొడ్డండ్ల అనిత, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బద్ధం సుజాత, ప్రధాన కార్యదర్శి వట్టిమల్ల శ్రీనివాస్, ఏనుగు రవీందర్ రెడ్డి, మండల కార్యదర్శి సుంకిసాల సత్యం, ప్యాక్స్ చైర్మన్ మైపతి రెడ్డి, బూత్ అధ్యక్షులు అంజి, రవికిరణ్, ఉట్నూర్ నరేష్, గడ్డం సంజీవ్, సాయికుమార్, సీనియర్ నాయకుడు కుంట రమేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నిరటి శ్రీనివాస్, కార్యదర్శి రాజేష్, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, వీడీసీ చైర్మన్ లింబద్రి గౌడ్, వార్డు సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.