BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 16 November 2026, 09:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెం పంచాయతీ పీఠం ఎవరిది.. ఆధిపత్య పోరులో పైచేయి సాధించేది ఎవరు?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 09:39 PM
71 వీక్షణలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో మారిన రాజకీయ సమీకరణాలు.. మరోసారి సత్తా చాటేందుకు కాలసాని సూర్యనారాయణ మాస్టారు ప్రయత్నం.. పట్టు నిలుపుకునేందుకు దేశిరెడ్డి రాఘవరెడ్డి వ్యూహాలు

ఏలూరు జిల్లా | నూజివీడు నియోజకవర్గం | చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. డిసెంబర్ 2వ తేదీన జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ వర్గాలు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు బూరుగుగూడెం రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీశాయి. కాలసాని సూర్యనారాయణ అలియాస్ మాస్టారు నాయకత్వంలో కూటమి నేతలు రాజకీయంగా పైచేయి సాధించారు. బూరుగుగూడెం–పర్వతాపురం ఎంపీటీసీ స్థానంలో కూటమి బలపరిచిన అభ్యర్థి బూబత్తుల నాగస్వరూప విజయం సాధించడం స్థానిక రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ ఫలితం రెండు గ్రామాల్లోనూ అప్పటి నాయకత్వంపై ఉన్న అసంతృప్తికి ఓటర్ల రూపంలో వ్యక్తీకరణగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదేవిధంగా చాట్రాయి జెడ్పీటీసీ ఎన్నికల్లో తేళ్లూరి శేఖర్‌కు అనూహ్యంగా లభించిన క్రాస్ ఓటింగ్ కూడా స్థానిక రాజకీయ చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే ఊపును కొనసాగిస్తూ బూరుగుగూడెం సర్పంచ్ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని కాలసాని సూర్యనారాయణ వర్గం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మరోవైపు ఇప్పటివరకు గ్రామ రాజకీయాల్లో బలమైన పట్టును కొనసాగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి తన నాయకత్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం అనుచరులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం పంచాయతీ ఎన్నికలపై పడకుండా ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కాలసాని సూర్యనారాయణ మాస్టారు రంగంలోకి దిగడం ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. మంత్రి కొలుసు పార్థసారథి ఆశీస్సులతో గ్రామ అభివృద్ధిని ప్రధాన అంశంగా ప్రస్తావిస్తూ కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో బూరుగుగూడెం అభివృద్ధికి ఇచ్చిన హామీలను అమలు చేయడంపై కూడా ప్రచారంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గత వీధులకు సిమెంట్ రోడ్లు నిర్మిస్తామన్న హామీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారింది. గ్రామమంతా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మంత్రి పార్థసారథి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీని నెరవేర్చి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనులే తమ విజయానికి బాటలు వేస్తాయని కూటమి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గతంలో గ్రామ రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగించిన నాయకత్వానికి ఇటీవల ఎన్నికల ఫలితాలు కొంత సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల సానుభూతి, గత అనుబంధాలు తమకు అనుకూలంగా మారతాయని వైఎస్సార్సీపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు వర్గాలు తమ అభ్యర్థుల గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో బూరుగుగూడెం ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. గ్రామ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇరువర్గాల ప్రచారం హోరాహోరీగా సాగుతుండటంతో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల ఫలితాల ప్రభావం కొనసాగుతుందా, లేక పంచాయతీ ఎన్నికల్లో కొత్త తీర్పు వెలువడుతుందా అన్నది ఇప్పుడు గ్రామంలో ప్రధాన చర్చగా మారింది. ఇరు వర్గాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండటంతో గెలుపు మెజారిటీ కూడా స్వల్పంగానే ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. చివరకు బూరుగుగూడెం గ్రామపంచాయతీ పీఠంపై ఎవరు జెండా ఎగురవేస్తారో డిసెంబర్ 2న ఓటర్లు ఇచ్చే తీర్పుతో తేలనుంది.