BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 16 November 2026, 08:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజేశ్వరపురం మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో చెరకు గానుగ ప్రారంభం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 08:57 PM
6 వీక్షణలు

రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం.. నష్టాలు వస్తున్నా కర్మాగారాన్ని కొనసాగిస్తున్నాం

లాభాపేక్ష లేకుండా రైతులకు అండగా నిలిచేందుకే పరిశ్రమ నిర్వహణ: మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలోని మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్మాగారంలో 2026–27 చెరకు గానుగ సీజన్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. సంస్థ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ మాజీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తన సతీమణి చిన్నమ్మతో కలిసి ఉదయం 9.54 గంటలకు చెరకు గడలను గానుగలో వేసి నూతన సీజన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కర్మాగారంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ ఏడాది చెరకు గానుగ సీజన్ విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

అనంతరం కర్మాగారం పరిధిలోని చెరకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో నామ సమావేశమై మాట్లాడారు. చక్కెర పరిశ్రమలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, నిర్వహణ వ్యయాలు, ఇతర ఆర్థికపరమైన సవాళ్లు పరిశ్రమల మనుగడకు ఆటంకంగా మారుతున్నాయని వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు కర్మాగారానికి సహకరించాలని కోరారు. రైతులు, పరిశ్రమ పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే ఇరువర్గాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

మధుకాన్ కర్మాగారం 26 ఏళ్ల ప్రయాణంలో ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితులను రైతులకు వివరించారు. ఈ 26 సంవత్సరాల్లో కోజనరేషన్ విద్యుత్ ఉత్పత్తి విభాగంలో రెండేళ్లు, చక్కెర ఉత్పత్తి విభాగంలో మరో రెండేళ్లు మాత్రమే లాభాలు వచ్చాయని, మిగిలిన 22 సంవత్సరాలు నష్టాలను ఎదుర్కొంటూనే కర్మాగారాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ రైతులకు అండగా నిలవాలనే సంకల్పంతోనే పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చక్కెర కర్మాగారాలు నష్టాలను భరించలేక మూతపడిన విషయాన్ని గుర్తుచేశారు. చక్కెర పరిశ్రమల మనుగడ కష్టతరంగా మారినప్పటికీ, చెరకు రైతులకు అందుబాటులో ఉండి వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో మధుకాన్ కర్మాగారాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కర్మాగారం నిర్వహణ వెనుక ఎలాంటి లాభాపేక్ష లేదని, రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.

తన తండ్రి స్వర్గీయ ముత్తయ్య కూడా రైతేనని, తాను సైతం రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని నామ పేర్కొన్నారు. రైతుల కష్టాలు, వారి జీవన పరిస్థితులు తనకు తెలుసని, వారి కోసం ఏదైనా చేయాలనే తపనతోనే ఈ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నానని వివరించారు. చెరకు రైతులకు కర్మాగారంతో ఉన్న అనుబంధం ఎంతో విలువైనదని, రైతుల సహకారం, సిబ్బంది అంకితభావంతోనే పరిశ్రమను ముందుకు తీసుకెళ్లగలమని అన్నారు. ప్రస్తుత గానుగ సీజన్‌ను అందరూ సమష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గానుగ ప్రారంభోత్సవం అనంతరం నామ దంపతులు చెరకు రైతులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా నామ స్వయంగా రైతులకు అల్పాహారం వడ్డిస్తూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. రైతులతో కలిసి సాధారణంగా మమేకమై సమయం గడపడం ద్వారా వారితో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.

అనంతరం రైతులు, కర్మాగార సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను ఆకాంక్షిస్తూ ప్రత్యేక సుదర్శన హోమం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమం వైభవంగా జరిగింది. హోమం ముగిసిన అనంతరం పూజారులు పాల్గొన్న వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నామ కుటుంబ సభ్యులు, సంస్థ ఏవీపీ కోటయ్య, శ్రేయోభిలాషులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, చెరకు రైతులు, కర్మాగార అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.