BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 08 October 2026, 11:55 am
Posted by : THALLAPALLI LAKSHMANA

వెలుగొండ నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మరో అవకాశం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
08 Oct, 2026 - 11:55 AM
13 వీక్షణలు

మార్కాపురం: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మరో అవకాశం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు.

ఈ నెల 9, 10 తేదీల్లో గెజిట్‌లో పేర్లు నమోదు కాని నిర్వాసితులు, నూతన గృహ నిర్మాణాలు చేపట్టిన నిర్వాసిత కుటుంబాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం మార్కాపురం మార్కెట్ యార్డులో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గెజిట్‌లో పేర్లు నమోదు కాకపోయిన నిర్వాసితులు, నూతన గృహ నిర్మాణాలు చేపట్టిన నిర్వాసిత కుటుంబాలు తమకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత తేదీల్లో ప్రత్యేక కౌంటర్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించి అర్హతకు సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు.