News Headlines
Chief Minister honours Chaganti at the Secretariat
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు :- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో :-కలెక్టర్ బి.సత్య ప్రసాద్
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

AP Politics: ఢిల్లీకి చేరిన గల్లీ రాజకీయం.. పార్లమెంటు వేదికగా టీడీపీ, వైసీపీ బిగ్‌ వార్‌..!

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుతోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు కొత్త ఫార్ములాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు, కేడర్‌పై జరుగుతున్న దాడులను పార్లమెంటులో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్‌ వ్యూహం సిద్ధం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుతోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు కొత్త ఫార్ములాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు, కేడర్‌పై జరుగుతున్న దాడులను పార్లమెంటులో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్‌ వ్యూహం సిద్ధం చేశారు.

ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష వైసీపీల మధ్య పీక్స్‌కు చేరిన పొలిటికల్‌ ఫైట్‌లో ఢిల్లీ ట్విస్ట్‌ ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టడానికి ఎంపీలందరికి రాష్ట్రంలో ఉన్న మంత్రిత్వ శాఖల్లో ఒక డిపార్ట్‌మెంట్‌, కేంద్రం మంత్రిత్వ శాఖల్లోని ఒక డిపార్ట్‌మెంట్‌ అటాచ్‌ చేస్తారు. అలా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఒక వారధిగా ఎంపీలు వ్యవహరిస్తారు. తద్వారా అదనంగా నిధులు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. ఏపీ అభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. జగన్‌ ధర్నాపై సమావేశంలో ప్రస్తావన రావడంతో… ఢిల్లీలో జగన్‌ ఏం చేస్తారో ముఖ్యం కాదని, మనమేం చేయాలో ముఖ్యమని నేతలకు సూచించారు చంద్రబాబు.

మరోవైపు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్‌ జగన్‌. తాడేపల్లి నివాసంలో ఎంపీలతో సమావేశమైన జగన్‌… ఢిల్లీలో తాను చేయబోయే ధర్నాపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతోన్న దాడులు, హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం, దేశం దృష్టి తీసుకెళ్లాలన్నారు జగన్‌. దీనిపై పార్లమెంటులో వైసీపీ గళం వినిపించాలన్నారు. ఉభయ సభల్లో ఏవిధంగా వ్యవహరించాలో ఎంపీలకు సూచించారు. వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను దేశవ్యాప్తంగా తెలియజేయాలని జగన్ సూచించారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారు.

అటు దేశ రాజధానిలో జగన్‌ ధర్నా, ఇటు పార్లమెంటులో టీడీపీ, వైసీపీ ఫైట్‌కి రంగం సిద్ధమైంది. దీంతో ఢిల్లీ పొలిటికల్‌ స్క్రీన్‌పై ఏపీ పొలిటికల్‌ సినిమా రచ్చకు కౌంట్‌డౌన్‌ షురూ అయింది.

Back To Top