BREAKING
thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు
Date of Publish : 07 October 2026, 11:07 am
Posted by : KANDHULA NARESH

అక్రమ కేసులతో వేధిస్తున్న కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు మద్దతుగా కోర్టుకు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మల్కాజ్‌గిరి
Reporter
Kandhula Naresh కుత్బుల్లాపూర్ మండల ప్రతినిధి
07 Oct, 2026 - 11:07 AM
2 వీక్షణలు

క్రిశాంక్‌కు మద్దతుగా సికింద్రాబాద్ కోర్టుకు బీఆర్ఎస్ నేతలు

అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు

హైదరాబాద్, ఎన్‌టుడే న్యూస్‌: బీఆర్ఎస్‌ నేత క్రిశాంక్‌పై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ నాయకులు సికింద్రాబాద్‌ కోర్టుకు చేరుకుని ఆయనకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.

బీఆర్ఎస్‌ ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు కోర్టుకు చేరుకుని క్రిశాంక్‌కు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న బీఆర్ఎస్‌ నాయకులను జైలుకు పంపేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.

క్రిశాంక్‌కు బీఆర్ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఆయనపై నమోదైన కేసుల విషయంలో న్యాయపరంగా పోరాడుతామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.