పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి.. సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి: మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిపై దాడికి పాల్పడ్డ సానిటరీ ఇన్‌స్పెక్టర్ నాయబ్ రసూల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు కేశవరావు మాట్లాడుతూ.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి చేసిన ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులపై వేధింపులు, దాడులు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.