BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 06:13 pm
Posted by : ADARI RAMA PRASAD

నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
08 Oct, 2026 - 06:13 PM
12 వీక్షణలు

మునగపాక: మునగపాక మండలం నాగులాపల్లి గ్రామంలో గ్రామ సంఘం అధ్యక్షురాలి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మహిళలకు ‘అభయ’ కార్యక్రమంపై పోలీసులు అవగాహన కల్పించారు. గ్రామ సంఘం షెడ్యూల్ సమావేశంలో వివిధ ప్రాజెక్టులు, గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. సచిదేవి ఆదేశాల మేరకు మునగపాక మండల పోలీసులు సమావేశానికి హాజరై మహిళలకు ‘అభయ’ కార్యక్రమం ఉద్దేశాలు, మహిళల భద్రతకు అందుబాటులో ఉన్న సేవలపై వివరించారు.

మహిళలు, బాలికలు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. సమస్యలను నేరుగా పోలీసుల దృష్టికి తీసుకువస్తే అవసరమైన సహాయం అందిస్తామని భరోసా కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.

అత్యవసర సహాయం కోసం 112, మహిళల సహాయం కోసం 181, వాట్సాప్ హెల్ప్‌లైన్ 7993485111, బాలల సహాయం కోసం 1098, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు 1930 నంబర్లను సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు.

మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలపై మౌనం వహించకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రత, హక్కులు, అందుబాటులో ఉన్న సహాయ సేవలపై అవగాహన పెంచేందుకు గ్రామస్థాయిలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ పి. గణేష్, మహిళా కానిస్టేబుల్ ఎం. వసుధ పాల్గొన్నారు. అనంతరం మహిళలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.