BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 01:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో రాజ్యాంగ విలువలపై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Nov, 2026 - 01:11 PM
18 వీక్షణలు

ప్రాథమిక హక్కులతో పాటు విధులను కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి 

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటూనే, రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను కూడా తప్పనిసరిగా పాటించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్ సూచించారు. మంగళవారం తిరువూరులోని ప్రతిభా డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ ఆమోద వారోత్సవాల్లో భాగంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు, హక్కులు, విధులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి పౌరులు తమ బాధ్యతలను గుర్తించి ఆచరించాలని సూచించారు. అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ ఎం. చెన్నారావుతో కలిసి జన విజ్ఞాన వేదిక నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. హరికృష్ణ, జిల్లా కార్యదర్శి ఎం. రాం ప్రదీప్, మండల ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు పి. వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.