అడ్డరోడ్డులో ఉద్యాన పంటల సాగుపై అవగాహన కార్యక్రమం
ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు వివరాలు
అడ్డరోడ్డు: రైతులకు ఉద్యాన పంటల సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంతో పాటు, ఉత్పాదకత పెంపు, పంటల నాణ్యత మెరుగుదల, మార్కెటింగ్ అవకాశాలపై సమాచారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
బల్లిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అడ్డరోడ్డు గ్రామానికి చేరుకున్న ప్రచార వాహనం ద్వారా రైతులకు ఆధునిక సాగునీటి పద్ధతులు, రక్షిత సాగు, నాణ్యమైన మొక్కల పెంపకం, పంటల నిల్వ, ప్యాకేజింగ్, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో బల్లిపల్లి గ్రామ వ్యవసాయ సహాయకుడు టి. రాజశేఖర్ రైతులకు వ్యవసాయ సంబంధిత సమాచారం అందించి, అవసరమైన మార్గదర్శకత్వం చేశారు.
అనంతరం కల్వరి హీలింగ్ మౌంట్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ప్రతినిధి పాస్టర్ పాల్ గంధం ‘స్వచ్ఛతా హి సేవా–2026’ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.