BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 22 August 2026, 07:53 pm
Posted by : MENDI SRINIVASARAO

బొబ్బిలిలో అంగరంగ వైభవంగా ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
22 Aug, 2026 - 07:53 PM
56 వీక్షణలు

బొబ్బిలిలో అంగరంగ వైభవంగా ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం

ఉమ్మడి విజయనగరం జిల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు కోలా బలరాం ఆధ్వర్యంలో బొబ్బిలి పట్టణంలో ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది జానపద కళాకారులు పాల్గొని తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

కార్యక్రమానికి జిల్లాకు చెందిన వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై జానపద కళాకారులను అభినందించారు. అనంతరం బొబ్బిలి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు, వివిధ జానపద కళారూపాలతో కళాకారులు పట్టణ ప్రజలను అలరించారు.

జానపద కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. కళాకారుల సంక్షేమం, జానపద కళల అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని పలువురు కోరారు.

ఈ కార్యక్రమం బొబ్బిలి పట్టణంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ విజయవంతంగా ముగిసింది.