BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

బోడేపూడి వెంకటేశ్వరరావుకు ఘన నివాళి పెనుగొలనులో 29వ వర్ధంతి సందర్భంగా స్మారక సభ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 01:58 PM
113 వీక్షణలు

బోడేపూడి వెంకటేశ్వరరావుకు ఘన నివాళి పెనుగొలనులో 29వ వర్ధంతి సందర్భంగా స్మారక సభ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, మధిర మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు 29వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సభలో రైతు సంఘం నాయకుడు మీనుగు కృష్ణ మాట్లాడుతూ బోడేపూడి వెంకటేశ్వరరావు 1922 ఏప్రిల్ 2న ఖమ్మం జిల్లా మధిర మండలం తొండల గోపవరం గ్రామంలో జన్మించారని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటంలో చురుకుగా పాల్గొని అనేకసార్లు జైలుశిక్ష అనుభవించారని పేర్కొన్నారు. దివిసీమ ఉప్పెన, అనంతపురం రైతుల ఆత్మహత్యలు, పాలమూరు వలసలు, విశాఖ కార్మిక సమస్యలు వంటి ప్రజా ఉద్యమాల్లో బాధితులకు అండగా నిలిచారని గుర్తు చేశారు.

ఇనపనూరి శంకరరావు మాట్లాడుతూ బోడేపూడి వెంకటేశ్వరరావు 1985 నుంచి 1997 ఆగస్టు 5న మరణించే వరకు మధిర శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేశారని కొనియాడారు. గంపలగూడెం, తిరువూరు, మధిర, ఎర్రుపాలెం, వైరా మండలాల్లో రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేసి నాగార్జునసాగర్ నీటిని అందించేందుకు విశేషంగా శ్రమించారని తెలిపారు.

ప్రగతి కాన్వెంట్స్ కరస్పాండెంట్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఎం శాసనసభాపక్ష నేతగా, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా సేవలందించారని చెప్పారు. రైతులు, కార్మికులు, పేదల సంక్షేమం కోసం జీవితాంతం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ 1997 ఆగస్టు 5 వరకు ఎర్రజెండా ఆశయాలను ప్రజల్లో నిలబెట్టారని పేర్కొన్నారు.

శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ ఆంధ్ర–తెలంగాణ అనే భేదం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో బోడేపూడి వెంకటేశ్వరరావు ఎల్లప్పుడూ ముందుండేవారని తెలిపారు. ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఊటుకూరు, పెనుగొలను, రాజవరం తదితర గ్రామాలకు నాగార్జునసాగర్ సాగునీరు అందించడంలో ఆయన చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మరువరని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రగతి కాన్వెంట్ ప్రిన్సిపాల్ వీరయ్య, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.