BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 12:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెం అభివృద్ధే లక్ష్యం.. కూటమి అభ్యర్థి కాలసాని శివకుమారి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 12:14 PM
149 వీక్షణలు

పోతనపల్లి సచివాలయంలో భారీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ దాఖలు**

మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో అభివృద్ధికి శ్రీకారం.. మున్ముందు మరింత అభివృద్ధి చేసి చూపిస్తాం

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉమ్మడి కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాలసాని శివకుమారి శనివారం పోతనపల్లి సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల భారీ సమక్షంలో నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రామంలో కూటమి శ్రేణుల ఐక్యతను చాటుతూ వందలాది మంది కార్యకర్తలు తరలిరావడంతో నామినేషన్ కార్యక్రమం రాజకీయ సందడిని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో చాట్రాయి జడ్పీటీసీ తేళ్లూరి శేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కాలసాని సూర్యనారాయణ, రాజబోయిన దశరథ రామరాజు, జనసేన నాయకుడు వెల్లంకి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొని శివకుమారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాలసాని శివకుమారి మాట్లాడుతూ బూరుగుగూడెం గ్రామ అభివృద్ధికి మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఇప్పటికే శ్రీకారం చుట్టామని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే ఏమిటో రానున్న రోజుల్లో చేతల్లో చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ గ్రామ ప్రగతిలో అందరినీ భాగస్వాములను చేస్తానని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలంటే కూటమి అభ్యర్థికి ప్రజల ఆశీర్వాదం అవసరమని, ఈ ఎన్నికల్లో తనకు విలువైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలతో బూరుగుగూడెంలో ఎన్నికల వాతావరణం నెలకొంది.