BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 04:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఉమ్మడి శోభారాణి నామినేషన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 04:28 PM
163 వీక్షణలు

విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలోకి వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థిగా ఉమ్మడి శోభారాణి దిగారు. శనివారం సీనియర్ నాయకుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోతనపల్లి గ్రామ సచివాలయంలో ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా తరలివచ్చారు. నామినేషన్ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామంలో ప్రజల మద్దతుతో సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా శోభారాణి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో పోతనపల్లి మాజీ సర్పంచ్ అర్జున్, గడ్డం లోకేష్ రెడ్డి, ఉమ్మడి సీతారాములు, కొరప్రోలు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచామని, ప్రజల ఆదరాభిమానాలు తమకు అండగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు తమకు అవకాశం కల్పిస్తే అందరినీ కలుపుకొని బూరుగుగూడెం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.