BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 28 September 2026, 07:51 am
Posted by : కూనురు మధు

తెలంగాణ ఉద్యమంలో బాపూజీ పాత్ర మరువలేనిది

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
28 Sep, 2026 - 07:51 AM
7 వీక్షణలు

NTODAY NEWS :  చిట్యాల 

భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిట్యాల పట్టణంలోని ముప్పా మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ చేనేత సహకార సంఘాల బలోపేతానికి, పద్మశాలి సమాజ అభ్యున్నతికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ఆయన చురుకుగా పాల్గొని, తన యావదాస్తిని సమాజ సేవకు అంకితం చేశారని గుర్తు చేశారు. ఆయన రాజకీయ జీవితం నేటితరం నాయకులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జెల్లా మనోహర్, ప్రధాన కార్యదర్శి గంజి వెంకటేశం, కోశాధికారి కుకుడాల గోవర్ధన్, గౌరవ సలహాదారులు చేపూరి శ్రీనివాస్, జెల్లా సత్తయ్య, ఈపూరి యాదగిరి, యోగ గురూజీ పున్న పాండుజీ, చిట్యాల చేనేత సహకార సంఘం అధ్యక్షులు గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్, కోశాధికారి కోట రాంబాబుతో పాటు పలువురు పద్మశాలి కుల పెద్దలు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.