BREAKING
thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
Test 4
Date of Publish : 12 November 2026, 08:27 am
Posted by : SEETHA KIRAN KUMAR

నర్సంపేటలోని డి-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన వరంగల్ సీపీ ఎన్. శ్వేత, ఐపీఎస్

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
12 Nov, 2026 - 08:27 AM
10 వీక్షణలు

-మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులకు సీపీ సూచనలు     

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ బుధవారం నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న డి-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా కేంద్రంలో మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి అందిస్తున్న వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వ్యసన బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, వారు మాదకద్రవ్యాల వ్యసనం నుంచి పూర్తిగా బయటపడేలా నిరంతర పర్యవేక్షణ, తగిన చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీస్ శాఖతో పాటు వైద్య శాఖ సమన్వయంతో పనిచేయడం ఎంతో కీలకమని సీపీ పేర్కొన్నారు. వ్యసనానికి గురైన వారిని నేరస్థులుగా కాకుండా బాధితులుగా పరిగణించి, వారికి అవసరమైన వైద్య సహాయం, మానసిక ధైర్యం కల్పించడంతో పాటు, తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా ప్రోత్సహించాలని సూచించారు    

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని సీపీ పిలుపునిచ్చారు.  

అనంతరం డి-అడిక్షన్ కేంద్రాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్ది, వ్యసన బాధితులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వసతులు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.   

ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్, నర్సంపేట ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్పెక్టర్ సాయిరమణ, ఆర్ ఎస్సై పూర్ణచందర్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరిబాయి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య, డి-అడిక్షన్ సెంటర్ ఇన్చార్జి డాక్టర్ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.