BREAKING
thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
Test 4
Date of Publish : 12 November 2026, 07:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆరు జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ 25 శాతం అవార్డులతో జాతీయ స్థాయిలో ఏపీకి గుర్తింపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:24 AM
9 వీక్షణలు

విశాఖపట్నానికి మిలియన్ ప్లస్ నగరాల విభాగంలో ప్రథమ స్థానం అమరావతి, నవంబర్ 12: స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26 అవార్డుల్లో రాష్ట్రానికి వివిధ విభాగాల్లో మొత్తం ఆరు జాతీయ అవార్డులు లభించాయి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రం తరఫున పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అవార్డులను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతో పాటు కుప్పం పురపాలక సంఘం జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకున్నాయి. అర్హత కలిగిన అవార్డుల్లో 25 శాతం సాధించి రాష్ట్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ వెల్లడించారు. దేశంలో అత్యధిక అవార్డులు సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం, మంత్రి నారాయణ నాయకత్వంలో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పట్టాభిరామ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 57 పురపాలక సంఘాలను ప్రత్యేకంగా గుర్తించి కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. అవార్డుల సాధన లక్ష్యంగా మూడు, నాలుగు నెలల ముందుగానే ప్రత్యేక నిపుణులతో పురపాలక సిబ్బందికి శిక్షణ, మార్గదర్శకత్వం అందించామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించినట్లు చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ షహర్ జోడీ అవార్డు విభాగంలో కుప్పం పురపాలక సంఘానికి గుర్తింపు లభించిందని తెలిపారు. మార్గదర్శక నగరం, మార్గదర్శనం పొందిన నగరం విభాగాల్లో తిరుపతి, కుప్పం అవార్డులు సాధించడం విశేషమన్నారు. విశాఖకు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో విశాఖపట్నం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించినట్లు పట్టాభిరామ్ వెల్లడించారు. విశాఖలో 58 దేశాలకు చెందిన 3,800 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్న భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సమయంలో ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, మంత్రి నారాయణను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న స్వచ్ఛత కార్యక్రమాలను కేంద్ర మంత్రి ప్రశంసించారని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి కార్యక్రమాల అమలుకు మార్గదర్శకాలు సూచిస్తామని తెలిపినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను పాత వ్యర్థాల నిల్వలు, చెత్త కుప్పలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పట్టాభిరామ్ తెలిపారు. వ్యర్థాల శుద్ధి, పునర్వినియోగం, వనరుల సమర్థ వినియోగానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరి సమష్టి కృషితోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొంటూ అందరికీ అభినందనలు తెలిపారు.