BREAKING
thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
Test 4
Date of Publish : 12 November 2026, 07:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సోనియా గాంధీ జీవిత చరిత్రపై తెలుగు సినిమా.. నిర్మాణానికి జగ్గారెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:23 AM
9 వీక్షణలు

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి సిద్ధమయ్యారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌ ఆధారంగా తెలుగులో సినిమా నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా నిర్మాణానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్థికంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ కోడలిగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తల్లిగా సోనియా గాంధీ సాగించిన జీవిత ప్రయాణంతో పాటు దేశ రాజకీయాల్లో ఆమె పోషించిన కీలక పాత్రను సినిమాలో చూపిస్తామని తెలిపారు. సోనియా గాంధీది విజయవంతమైన రాజకీయ ప్రస్థానమని, ఆమెకు ప్రధానమంత్రి పదవిపై ఎప్పుడూ వ్యామోహం లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ పీవీ నరసింహారావుకు ఆ అవకాశం కల్పించారని, యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలోనూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని పలువురు కోరినా మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ఎంపిక చేశారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి పదవిని రెండుసార్లు వదులుకోవడం ఆమె రాజకీయ జీవితంలో చారిత్రాత్మక ఘట్టమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నది సోనియా గాంధీ ఆకాంక్ష అని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారని, నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవస్థ సముద్రం అంత లోతైనదని, దేశంలో సోనియా గాంధీకి ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు.