కదిరి బాబురావును కలిసిన బీసీ యాదవ సామాజికవర్గ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
చంద్రశేఖరపురం
కనిగిరి: కోయిలంపాడు గ్రామానికి చెందిన బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రతినిధులు ఆదివారం సేలంవారిపల్లి గ్రామంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం పార్లమెంటు పరిశీలకుడు కదిరి బాబురావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కదిరి బాబురావుకు బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎలికా వెంకటనారాయణ, మాజీ ఎంపీటీసీ మునగల నారాయణరెడ్డి, దాసరి నారాయణస్వామి, ఎలికా నాగేశ్వరరావు, అంగిరేకుల చిన్న మస్తాన్, కూరాకుల అంకయ్య, అంగిరేకుల రుసులయ్య, కాకు నాగేశ్వరరావు, మీసాల మస్తాన్, చెనికల మస్తాన్, అంగిరేకుల నాగూర్, షేక్ అహ్మద్, అంగిరేకుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.