Hyderabad: హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. పాల్గొన్న అమిత్ షా
తెలంగాణ
/
హైదరాబాద్
జాతీయ జెండా చేతబట్టి పాదయాత్రలో ముందుకు సాగిన కేంద్ర హోంమంత్రి
హైదరాబాద్, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహిస్తున్న మహా పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. నిజాం కాలేజ్ నుంచి మొజాంజాహీ మార్కెట్ వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
ప్రముఖ బీజేపీ నేతలతో కలిసి పాదయాత్ర
జాతీయ జెండా చేతబట్టి అమిత్ షా పాదయాత్రలో ముందుకు సాగారు. ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు, జాతీయ జెండాలతో ముందుకు సాగారు.