BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:28 pm
Posted by : PEDDABOINA SRIKANTH

నవంబర్ 23న కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర..

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
21 Nov, 2026 - 02:28 PM
25 వీక్షణలు

విజయవంతం చేయాలని ఎల్కతుర్తి మండల పార్టీ పిలుపు
మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం

ఎల్కతుర్తి, నవంబర్ 21 (ఎన్ టుడే న్యూస్): ఈ నెల 23వ తేదీన కరీంనగర్‌లో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని ఎల్కతుర్తి మండల బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రభారి లక్కిరెడ్డి తిరుమల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రచారంపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, జాతీయ భద్రత, దేశ స్వాభిమానం వంటి అంశాలపై ప్రజలకు వివరించడమే మహా పాదయాత్ర ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ నెల 23న కరీంనగర్‌లో లక్ష మందితో మహా పాదయాత్ర నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోందని, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని తెలిపారు. ఎల్కతుర్తి మండలం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

సమావేశంలో మండల పార్టీ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహా పాదయాత్రకు మండల స్థాయి నుంచి ప్రజలను, కార్యకర్తలను సమీకరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.