BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 04:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో లంచం కలకలం..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 04:37 PM
19 వీక్షణలు

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌హెచ్‌ఓ

హైదరాబాద్: ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పోలీసు అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ఘటన హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఎల్. రమేష్ నాయక్ ఓ హోటల్ యజమాని నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హోటల్‌ను అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటే ప్రతి నెలా రూ.50 వేలు చెల్లించాలని ఎస్‌హెచ్‌ఓ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలుత రూ.10 వేలు తీసుకున్న ఆయన, అక్టోబర్ 31న హోటల్ యజమాని నుంచి మరో రూ.20 వేలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన అధికారులు పోలీస్ స్టేషన్‌లోనే డబ్బులు తీసుకుంటున్న సమయంలో దాడి చేసి రమేష్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించి, కుటుంబ సభ్యుల ఆశలు, ఆకాంక్షలతో విధుల్లో చేరిన కొందరు అధికారులు అక్రమ సంపాదనకు ఆశపడి తమ భవిష్యత్తును, కుటుంబాల గౌరవాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవడం విచారకరం. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించి లంచాలకు పాల్పడితే వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిజాయితీగా విధులు నిర్వహించే అధికారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాభిప్రాయం: ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం జీతం, హోదా మాత్రమే కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత కూడా. లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రతి అధికారి ఘటన నుంచి ఇతరులు గుణపాఠం నేర్చుకోవాలి. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత.