BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:13 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌ ముషీరాబాద్‌ లో బీజేపీ BLAపై కేసు నమోదు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Oct, 2026 - 06:13 PM
1 వీక్షణలు

ముషీరాబాద్‌లో బీజేపీ బీఎల్‌ఏపై కేసు నమోదు

హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఫారం-7 ప్రీ-ప్రింటెడ్ పత్రాలను సమర్పించిన వ్యవహారంలో బీజేపీ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ) బాలచందర్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈఆర్వో ప్రవీణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఫిర్యాదు వివరాల ప్రకారం.. 30 మంది ఓటర్లకు సంబంధించిన ఫారం-7 పత్రాలను బాలచందర్ తీసుకొచ్చి సమర్పించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. సంబంధం లేని ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఈ ఫారాలను సమర్పించినట్లు ఈఆర్వో తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

అయితే ఫారం-7 పత్రాలను స్వీకరించేందుకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) నిరాకరించినట్లు తెలిపారు. అనంతరం పత్రాలను పోలింగ్ కేంద్రం ప్రాంగణంలోనే వదిలి వెళ్లినట్లు ఈఆర్వో ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఈఆర్వో ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదులో పేర్కొన్న 30 మంది ఓటర్ల వద్దకు వెళ్లి అధికారులు విచారణ నిర్వహించినట్లు సమాచారం.

అధికారుల విచారణలో 30 మంది ఓటర్లు స్థానికంగానే నివసిస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సంబంధిత ఓటర్ల పేర్లు, ఈపీఐసీ నంబర్లు, చిరునామా వివరాలను ఈఆర్వో పోలీసులకు అందించినట్లు సమాచారం.

ఫారం-7 దరఖాస్తుల సమర్పణకు సంబంధించిన వ్యవహారంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 31 కింద చర్యలు తీసుకోవాలని ఈఆర్వో తన ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఫారం-7 పత్రాల సమర్పణకు సంబంధించిన పరిస్థితులు, ఉద్దేశం, సంబంధిత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.