BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 12:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఎస్ఐ డి. రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 12:53 PM
38 వీక్షణలు

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో డిసెంబర్ 2వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు వివిధ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. కేంద్రాల వద్ద అనవసర గుమిగూడటం, వాగ్వాదాలు, ఘర్షణలకు దిగడం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తోడ్పడాలని ఎస్ఐ డి. రామకృష్ణ కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.