BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 06:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిలకలూరిపేటలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. డ్రైవర్ సమయస్ఫూర్తితో చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 06:12 PM
118 వీక్షణలు

చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ వద్ద సోమవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. పాఠశాల ముగిసిన సమయంలో ఒక్కసారిగా కొందరు విద్యార్థులు రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ రావడంతో, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ సిలిండర్లను తరలిస్తున్న ఆటో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. పిల్లలను కాపాడేందుకు ఆటోను ఒక్కసారిగా పక్కకు మళ్లించడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ఆటోలో ఉన్న ఆక్సిజన్, హైడ్రోజన్ సిలిండర్లు పేలకుండా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తి, అప్రమత్తత కారణంగా విద్యార్థుల ప్రాణాలు సురక్షితంగా దక్కాయి. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే, పాఠశాల వదిలే సమయంలో విద్యార్థుల భద్రత కోసం గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేదా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు రోడ్లపైకి పరుగులు తీయకుండా పాఠశాల యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.