BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 12:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీ.. అభ్యర్థుల విజయానికి నేతల విస్తృత ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 12:53 PM
36 వీక్షణలు

చింతలపూడి: నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతలపూడిలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఉన్నమట్ల ఎలిజా, ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు విస్సంపల్లి సుందర్రావు, మండల అధ్యక్షుడు జగ్గవరపు పెద్ద కోటిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తూ ప్రచార ర్యాలీ నిర్వహణలో ముందుండి నడిపించారు. నగర పంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. చైర్మన్ అభ్యర్థి మల్లెల పద్మతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు విస్సంపల్లి ఆదిలక్ష్మి, నారపాం దేవమాతలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు నగర పంచాయతీ అభివృద్ధికి తమ అభ్యర్థులు కృషి చేస్తారని నాయకులు ప్రచారంలో వివరించారు. అదేవిధంగా కేంద్ర స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. ఈ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గార్లపాటి మురళి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.