BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 08:37 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చంద్రబాబు కంటే పవన్‌కే ఎక్కువ మద్దతు.. అనధికారిక అభిప్రాయ సేకరణలో ఆసక్తికర అంశాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 08:37 AM
102 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ నాయకుడు ఎవరు? అనే అంశంపై వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను వ్యక్తిగతంగా కలవడం, ఫోన్ ద్వారా మాట్లాడటం, రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ఓ అనధికారిక విశ్లేషణ నిర్వహించబడింది.

ఈ అభిప్రాయ సేకరణలో ముఖ్యంగా రెండు పేర్లు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యమంత్రి  మరియు ఉప ముఖ్యమంత్రి . అయితే, మెజారిటీగా స్పందించిన పలువురు ప్రజలు నిజాయతీ, వ్యక్తిగత ఇమేజ్, అవినీతి ఆరోపణలు లేని నాయకత్వం వంటి అంశాల్లో పవన్ కళ్యాణ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు.

కొంతమంది అభిప్రాయం ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రావాల్సిన మంచి పేరు, ప్రతిష్ఠలు ప్రభుత్వంలోని కొందరు మంత్రుల వ్యవహార శైలి కారణంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పై వచ్చిన అవినీతి ఆరోపణలు, అలాగే మంత్రి పై ఉన్న వ్యతిరేక భావన కూడా ప్రభుత్వ ప్రతిష్ఠపై ప్రభావం చూపిందని కొందరు అభిప్రాయపడ్డారు.

మరోవైపు, పవన్ కళ్యాణ్‌ను నిజాయతీ గల నాయకుడిగా, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తిగా, అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నాయకుడిగా యువత, విద్యావంతులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సహా అనేక వర్గాలు గుర్తించినట్లు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కుల, మతాలకు అతీతంగా ఆయనకు మద్దతు లభిస్తోందని పలువురు పేర్కొన్నారు.

అయితే, ఇవి అధికారిక సర్వే ఫలితాలు కాకుండా, వివిధ వర్గాల నుంచి సేకరించిన వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణ మాత్రమే.