కాటేదాన్‌లో కెమికల్ పేలుడు.. ఇద్దరికి గాయాలు
తెలంగాణ
/
హైదరాబాద్
- బాటిళ్ల తయారీ కంపెనీలో ప్రమాదం.. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
రంగారెడ్డి జిల్లా | ఎన్ టుడే న్యూస్:
రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ పేలుడు సంభవించి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో సాయి అనే వ్యక్తి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అతని కాలికి కూడా తీవ్ర గాయమై, పాదం కొంతభాగం తెగిపోయినట్లు సమాచారం. దీంతో సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరికీ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కంపెనీలో పేలుడు ఎలా సంభవించింది? రసాయనాల నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికావాల్సి ఉంది.