BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 01:27 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చెర్లోపల్లి పంచాయతీకి తక్షణమే రీ-నోటిఫికేషన్ ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / చంద్రశేఖరపురం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
24 Nov, 2026 - 01:27 PM
2 వీక్షణలు

నామినేషన్ల అక్రమ తిరస్కరణపై ఉన్నతాధికారులు స్పందించాలి.. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఏకగ్రీవ ప్రకటన చేయడం సరికాదు

చెర్లోపల్లి:

చంద్రశేఖరపురం మండలం చెర్లోపల్లి పంచాయతీలో నామినేషన్ల తిరస్కరణపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతనబోయిన వెంకటరత్నమ్మ దాఖలు చేసిన మూడు సెట్ల నామినేషన్లతో పాటు, ఆమెకు మద్దతుగా దాఖలైన మరో మూడు నామినేషన్లను అధికార బలంతో అక్రమంగా తిరస్కరించారని వారు ఆరోపించారు. అనంతరం పంచాయతీని ఏకగ్రీవంగా ప్రకటించుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటమి భయంతో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలను పక్కదారి పట్టించడం సరికాదని, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాభిమానాన్ని నిరూపించుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలపై ఎన్నికల అధికారులు సమగ్రంగా విచారణ జరపాలని కోరారు.

ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. చెర్లోపల్లి పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రక్రియను పరిశీలించి, అక్రమాలు జరిగినట్లు తేలితే ఎన్నికను రద్దు చేసి తక్షణమే రీ-నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.

నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజలకు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు.