BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:45 pm
Posted by : కూనురు మధు

కాంగ్రెస్‌లో చేరిన చిట్యాల 1వ వార్డు కౌన్సిలర్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
07 Oct, 2026 - 06:45 PM
47 వీక్షణలు


NTODAY NEWS : చిట్యాల 


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేనిగూడెం కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్ అలియాస్ కావేరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సూచన మేరకు బుధవారం పట్టణంలోని లక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తన అనుచరులు, కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోకల దేవదాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్‌తో పాటు ఇతరులకు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు తదితర కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్ మాట్లాడుతూ శివనేనిగూడెంలో ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డు సమస్యతో పాటు ఐడియల్ కంపెనీ కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన వార్డు ప్రజలకు బాధ్యతగా ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, పట్టణ అధ్యక్షుడు ఎద్దులపురి కృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు ఏర్పుల పరమేష్, దేశపాక లత రాజేష్, జెరిపోతుల సత్యనారాయణ, గాలి యాదమ్మ, జిల్లా నాయకుడు పాటి నర్సిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, ఎస్కే షబానా, ఎస్కే ఇమ్రాన్, నాయకులు పాటి మాధవరెడ్డి, ఎస్కే ఇబ్రహీం, సిలివేరు శేఖర్, దాసరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.