జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూటమి క్లీన్‌స్వీప్..
చైర్‌పర్సన్‌గా రొంగల అనూష ఘన విజయం 32 వార్డులకు 27 వార్డులు కైవసం..
టీడీపీ 20, జనసేన 6, బీజేపీ ఒక వార్డులో విజయం 7,503 ఓట్ల భారీ మెజారిటీతో చైర్పర్సన్ అభ్యర్థి గెలుపు ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి పురపాలక పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ నెల 1వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 32 వార్డులకు గాను 27 వార్డుల్లో విజయం సాధించి మున్సిపాలిటీలో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. పార్టీల వారీగా ఫలితాలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ 20 వార్డుల్లో, జనసేన పార్టీ 6 వార్డుల్లో, బీజేపీ ఒక వార్డులో విజయం సాధించాయి. మరోవైపు వైఎస్సార్సీపీ 3 వార్డులను, స్వతంత్ర అభ్యర్థులు 2 వార్డులను కైవసం చేసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన కూటమి అభ్యర్థి రొంగల అనూష 7,503 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కూటమి వశమైంది. విజయం సాధించిన చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లందరికీ చింతలపూడి శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. వార్డుల వారీగా విజేతలు, మెజారిటీ వివరాలు: 1వ వార్డు – టీడీపీ – ముప్పిన శేఖర్ – 220 ఓట్లు 2వ వార్డు – జనసేన – షేక్ హసీనా – 348 ఓట్లు 3వ వార్డు – టీడీపీ – అప్పికొండ అనంతలక్ష్మి – 225 ఓట్లు 4వ వార్డు – జనసేన – బాదారాల నరేష్ – 32 ఓట్లు 5వ వార్డు – వైఎస్సార్సీపీ – పిండి రాము – 125 ఓట్లు 6వ వార్డు – జనసేన – ముప్పిడి మోహన దుర్గ – 20 ఓట్లు 7వ వార్డు – వైఎస్సార్సీపీ – నేకురి కిషోర్ – 66 ఓట్లు 8వ వార్డు – స్వతంత్ర – మద్దిపాటి ఉదయ్ – 4 ఓట్లు 9వ వార్డు – టీడీపీ – సుంకర వెంకటలక్ష్మి 10వ వార్డు – టీడీపీ – లావణ్య 11వ వార్డు – టీడీపీ – కరణం రాంబాబు 12వ వార్డు – టీడీపీ – కొండ్రెడ్డి కిషోర్ 13వ వార్డు – వైఎస్సార్సీపీ – జక్కుల మరియమ్మ 14వ వార్డు – టీడీపీ – సుభాషిని 15వ వార్డు – టీడీపీ – రాగోలు లక్ష్మి 16వ వార్డు – జనసేన – కొల్లిపర్ల ఆనంద్ 17వ వార్డు – టీడీపీ – కరుటూరి రమాదేవి – 200 ఓట్లు 18వ వార్డు – టీడీపీ – నంబూరి రామచంద్రరావు – 344 ఓట్లు 19వ వార్డు – బీజేపీ – వేమూరి శ్రీనివాస్ – 349 ఓట్లు 20వ వార్డు – టీడీపీ – కంపా వినయ్ – 82 ఓట్లు 21వ వార్డు – జనసేన – గురుజు ఉమామహేశ్వరి – 297 ఓట్లు 22వ వార్డు – టీడీపీ – గుళ్లపూడి శ్రీదేవి – 281 ఓట్లు 23వ వార్డు – టీడీపీ – కర్పూరం మానస – 353 ఓట్లు 24వ వార్డు – టీడీపీ – చిట్టిబోయిన రామలింగేశ్వరరావు – 187 ఓట్లు 25వ వార్డు – టీడీపీ – మాణికల సూర్యారావు – 425 ఓట్లు 26వ వార్డు – టీడీపీ – రొంగల దేవి ప్రసాద్ – 21 ఓట్లు 27వ వార్డు – టీడీపీ – మంత్రాపూడి లీలా సరోజ – 327 ఓట్లు 28వ వార్డు – టీడీపీ – బండారు శ్రీ రామకోటి సత్యవతి – 360 ఓట్లు 29వ వార్డు – జనసేన – గంట్రోతు హిమబిందు – 200 ఓట్లు 30వ వార్డు – టీడీపీ – చేను ప్రసాద్ – 421 ఓట్లు 31వ వార్డు – స్వతంత్ర – ఈర్నీ శాంత కుమారి – 323 ఓట్లు 32వ వార్డు – టీడీపీ – యడ్లపల్లి అశోక రాణి – 183 ఓట్లు