వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు నిబంధనల ప్రకారం పరిహారం
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
ప్రకాశం జిల్లా: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ పరిహారంపై కలెక్టర్ విజయ సునీత శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి నిర్వాసితుడికి నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని తెలిపారు.
ఆర్‌అండ్‌ఆర్ పరిహారం కోసం ప్రభుత్వం రూ.906 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.758.31 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ వెల్లడించారు. మిగిలిన అర్హుల వివరాలను పరిశీలించి, అర్హుల జాబితాను త్వరలో తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు.
నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొన్నారు.