BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 13 October 2026, 05:34 pm
Posted by : PAGADALA DEVAIAH

శ్రీ కోదండరాం నగర్‌లో యువకుడిపై దాడి ఘటనను ఖండన

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
13 Oct, 2026 - 05:34 PM
12 వీక్షణలు

శ్రీకోదండరాం నగర్‌లో యువకుడిపై దాడి ఘటనను ఖండించిన బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

మగ్గం దుకాణదారుల గుర్తింపు, ఆధార్ కార్డుల ప్రామాణికతపై విచారణ జరపాలి – పోలీసులకు డిమాండ్

గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోను శ్రీకోదండరాం నగర్ కాలనీలో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రశ్నించిన బీమ్ రాజ్ అనే యువకుడిపై దాడి పై గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

నిన్న రాత్రి కాలనీలో రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని బీమ్ రాజ్ ప్రశ్నించడంతో, 30 మందికి పైగా వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే రాత్రి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు వివరాలు తెలియజేసి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఘటనకు నిరసనగా ఈరోజు ఉదయం శ్రీకోదండరాం నగర్ కాలనీలోని మగ్గం దుకాణదారులు ఒకరోజు దుకాణాలను మూసివేశారు. కాలనీవాసుల ఆందోళన నేపథ్యంలో సరూర్‌నగర్ సీఐ శ్రీశైలం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకోదండరాం నగర్ కాలనీలో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఈ విషయాలను సంబంధిత అధికారులతో పాటు డీసీపీ గారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం లభించకపోవడం బాధాకరం.

రోడ్డుపై ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రశ్నించిన యువకుడిపై దాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణలను పోలీసులు తీవ్రంగా పరిగణించాలి. ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

అదేవిధంగా, కాలనీలో మగ్గం దుకాణాలు నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన ఆధార్ కార్డులను నకిలీగా పొందిన అనంతరం ఇక్కడికి వచ్చి మగ్గం దుకాణాల్లో పనిచేస్తున్నారనే సమాచారం స్థానికుల ద్వారా అందుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలి. ఈ ఆరోపణల్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో నిర్ధారించేందుకు సంబంధిత వ్యక్తుల గుర్తింపు, నివాస వివరాలు, ఆధార్ కార్డుల ప్రామాణికతను చట్టబద్ధంగా పరిశీలించాలి.

అక్రమ వలసలు లేదా నకిలీ పత్రాల వినియోగం జరిగినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరినీ వారి మతం ఆధారంగా లక్ష్యంగా చేసుకోకుండా, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి.

కాలనీలో నివసించే ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలి. ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించి, కాలనీలో శాంతిభద్రతలను పరిరక్షించాలని పోలీసు అధికారులను కోరుతున్నాం పేర్కొన్నారు.

దుకాణాల నిర్వహణ సమయాలపై పోలీసుల సూచనలు

కాలనీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మగ్గం దుకాణాల నిర్వహణ సమయాలపై సరూర్‌నగర్ సీఐ శ్రీశైలం సూచనలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు నిర్వహించాలని, నిర్ణీత సమయం తర్వాత దుకాణాలు తెరిచి ఉంచితే చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, శ్రీకోదండరాం నగర్ కాలనీ అధ్యక్షుడు కందికంటి ప్రేమ్ నాథ్ గౌడ్, విశ్వహిందూ పరిషత్ నాయకుడు అనంత చారి, గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్, సీనియర్ నాయకులు చిలుకూరి రామ్ రెడ్డి, కిట్టు, సిరి రెడ్డి, మురళి, యువకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.