తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఏఐసీసీ ఆమోదంతో అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లు పార్టీ అధిష్టానం వెల్లడించింది.
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది.
అదేవిధంగా నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది.
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమైంది. తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 30న ప్రచురించనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది.
కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేయడంతో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల దృష్టి మరింత పెరిగింది.