BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 07:02 pm
Posted by : K MAHESH

సీఎం రేవంత్‌రెడ్డి ఆప్తమిత్రుడు రోహిన్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 07:02 PM
16 వీక్షణలు

మండల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని వినతి

మౌలిక వసతులు, అంతర్గత రహదారులు, గ్రామీణ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి

నెల్లికుదురు, నవంబర్ 21:

మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు అధిక నిధులు కేటాయించేలా సహకరించాలని కోరుతూ నెల్లికుదురు మండల కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆప్తమిత్రుడు రోహిన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్‌తో కలిసి హైదరాబాద్‌లోని రోహిన్‌రెడ్డి స్వగృహంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కాసం రంజిత్ రెడ్డి, మండల నాయకుడు ఆకుతోట సతీష్ రోహిన్‌రెడ్డికి పూల బొకే అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ.. నెల్లికుదురు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అధిక నిధులు కేటాయించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మండల సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరులో తన వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

వారి వినతిపై రోహిన్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నెల్లికుదురు మండల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.