రైతులకు ఉపయోగకరంగా ఇంకుడు గుంతల నిర్మాణం
NTODAY NEWS చిట్యాల
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఫారం పాండ్ 10×10 ఇంకుడు గుంతను గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతు తమ వ్యవసాయ బావి సమీపంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు దోహదపడటమే కాకుండా, నిల్వ చేసిన నీటిని కూరగాయల సాగుకు, చేపల పెంపకానికి వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న రైతులకు మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉన్నట్లయితే, ప్రభుత్వం ద్వారా బర్ల షెడ్డు నిర్మాణం, రెండు గేదెల మంజూరుకు సంబంధించిన అవకాశం ఉందని వివరించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పథకంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు యాదయ్య, చేకూరి గణేష్, ఫీల్డ్ అసిస్టెంట్ చేకూరి మల్లేష్, రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు.