BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 04:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కమ్యూనిస్టులపై వ్యాఖ్యల వివాదం.. సింగర్ నర్సిరెడ్డి క్షమాపణలు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 04:32 PM
23 వీక్షణలు

వివాదానికి తెరదించే ప్రయత్నం.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన నర్సన్న కమ్యూనిస్టులపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ప్రముఖ గాయకుడు నల్గొండ నర్సిరెడ్డి స్పందించారు. ఈ వివాదంపై తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వివరణ ఇస్తూ కమ్యూనిస్టు సోదరులకు, కళాభిమానులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలిపారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను పాడిన పాటలోని కొన్ని పదాలు ప్రస్తుతం వివాదానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. తాను కష్టాన్ని నమ్ముకుని, పాటనే నమ్ముకుని ఈ స్థాయికి వచ్చానని నర్సిరెడ్డి తెలిపారు. హోటల్‌లో పనిచేసిన రోజులు, కారు డ్రైవర్‌గా జీవనం సాగించిన అనుభవాల నుంచి శ్రామిక వర్గాల మధ్య పెరిగానని గుర్తుచేశారు. చిన్నప్పటి నుంచే విప్లవ గీతాలంటే తనకు ఎంతో ఇష్టమని, గద్దర్, గోరేటి వెంకన్న, విమలక్క వంటి ప్రజా గాయకుల పాటల నుంచి స్ఫూర్తి పొందానని వివరించారు. ప్రజల ఆదరణతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఒక వ్యక్తి వద్ద పనిచేస్తున్న సమయంలో, స్థానిక పరిస్థితులు, అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆవేశంలో కొన్ని పదాలతో పాట పాడినట్లు తెలిపారు. అప్పటి రచయితలు రూపొందించిన పదాలతోనే ఆ పాట పాడానని, దాదాపు ఆరేడేళ్ల క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆ పాటను ఆలపించానని వివరించారు. తాను ఎప్పుడో మర్చిపోయిన చిన్న వీడియో క్లిప్‌ను తిరిగి బయటకు తీసి ప్రచారం చేస్తారని ఊహించలేదన్నారు. ఆ వీడియో కారణంగా కమ్యూనిస్టు సోదరులు తీవ్రంగా బాధపడటం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్య కాదని స్పష్టం చేశారు. తన మాటలు, పాట వల్ల మనస్తాపానికి గురైన ప్రతి కమ్యూనిస్టు సోదరుడికి, కళాహృదయులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. ఇకపై సమాజ హితాన్ని కోరే సామాజిక గీతాలను కూడా మరింతగా ప్రజల ముందుకు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఎప్పటిలాగే తనను, తన పాటలను ఆదరించాలని అభిమానులను కోరుతూ ఫేస్‌బుక్ వేదికగా తన వివరణను ముగించారు. తాజా క్షమాపణలతో ఈ వివాదానికి తెరపడుతుందా అనే చర్చ సంగీత, రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది

.