BREAKING
thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు
Test 4
Date of Publish : 25 November 2026, 08:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరజాముల తండాలో నామినేషన్ల జాబితాపై వివాదం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:06 AM
26 వీక్షణలు

నోటీసు బోర్డుపై టీడీపీ అభ్యర్థుల పేర్లే దర్శనం.. వైసీపీ, స్వతంత్ర అభ్యర్థుల పేర్లు మాయం

60 నామినేషన్లు దాఖలు.. అధికారుల తీరుపై అభ్యర్థుల ఆగ్రహం

మార్కాపురం జిల్లా:  పంచాయతీ ఎన్నికల వేళ మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం నరజాముల తండా పంచాయతీలో నామినేషన్ల పరిశీలన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సర్పంచి పదవికి మొత్తం 60 నామినేషన్లు దాఖలు కాగా, వాటి పరిశీలన అనంతరం నోటీసు బోర్డుపై ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టీడీపీ అభ్యర్థుల పేర్లు మాత్రమే కనిపించడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. వైసీపీ, స్వతంత్ర అభ్యర్థుల పేర్లు జాబితాలో లేకపోవడంపై ఆయా అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మంగళవారం నామినేషన్ పత్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారులు అన్ని పత్రాలను పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు తెలిపారని అభ్యర్థులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు నోటీసు బోర్డుపై అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని అధికారులు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో నోటీసు బోర్డును పరిశీలించగా టీడీపీ అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉండటంతో మిగిలిన అభ్యర్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.

నామినేషన్ల పరిశీలనలో ఎలాంటి లోపాలు లేవని చెప్పిన అధికారులు, తీరా అభ్యర్థుల జాబితాలో తమ పేర్లు ఎందుకు కనిపించడం లేదని వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని ఆర్‌ఓను కోరినప్పటికీ సరైన సమాధానం లభించలేదని వారు ఆరోపించారు. దీంతో అభ్యర్థులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయగా, వైసీపీ అభ్యర్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివాదం కాస్తా నడిరోడ్డుపైకి చేరడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాల్సిన అధికారులు అభ్యర్థుల పేర్ల ప్రకటన విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 60 నామినేషన్లకు సంబంధించి పరిశీలన ఫలితాలు, అర్హులైన అభ్యర్థుల పూర్తి జాబితాను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నరజాముల తండాలో చోటుచేసుకున్న ఈ పరిణామాలపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాల్సిఉంది.