బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
రామన్నపేట
రామన్నపేట, అక్టోబర్ 12: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల బీజేపీ లేబర్ సెల్ కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్, కో-కన్వీనర్‌గా దుబ్బాక గ్రామానికి చెందిన కాందూరి నరేష్ నియమితులయ్యారు.
బీజేపీ లేబర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అంది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నల్లగొండలో జిల్లా కన్వీనర్ ఐతరాజు సిద్దు, కో-కన్వీనర్ అనుమొజు రామాచారి నూతనంగా నియమితులైన నాయకులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కూనూరు సుధాకర్ గౌడ్, కాందూరి నరేష్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.