BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 04:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పురాతన దస్తావేజుల నకళ్లు ఇక క్షణాల్లోనే..

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 04:44 PM
26 వీక్షణలు

రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటలైజేషన్ 1950 నుంచి 2000 వరకు రిజిస్ట్రేషన్‌ అయిన పత్రాల స్కానింగ్‌ ప్రారంభం

కరీంనగర్‌: దశాబ్దాల క్రితం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూములు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల నకళ్లు పొందాలంటే ఇకపై రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ప్రజలకు సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కంప్యూటరీకరణకు ముందు నమోదైన పాత దస్తావేజులను డిజిటలైజేషన్‌ చేసే ప్రక్రియ చేపట్టింది. 1950 నుంచి 2000 సంవత్సరం వరకు రిజిస్ట్రేషన్‌ పూర్తయిన దస్తావేజులను స్కాన్‌ చేసి కంప్యూటర్లలో భద్రపరిచే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సిబ్బంది పాత రికార్డులను స్కాన్‌ చేసి కంప్యూటర్లలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. గతంలో పాత దస్తావేజుల నకళ్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకుంటే రికార్డులను వెతికి గుర్తించి నకళ్లు అందించేందుకు అధికారులు రోజుల సమయం తీసుకునేవారు. ఈ ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం చేపట్టిన డిజిటలైజేషన్‌తో పాత దస్తావేజుల వివరాలు కంప్యూటర్లలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రజలు దరఖాస్తు చేసుకున్న వెంటనే రికార్డులను సులభంగా గుర్తించి నకళ్లు అందించే అవకాశం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్‌ సేవల్లో వేగం పెరగడంతో పాటు పాత రికార్డుల భద్రతకు కూడా ఈ విధానం దోహదపడనుంది.