కొండపి సర్కిల్ పరిధిలోని పొన్నలూరు గ్రామంలో బీసీ కాలనీ నందు కార్డెన్ అండ్ సెర్చ్
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
పొన్నలూరులో కార్డన్ అండ్ సెర్చ్.. పత్రాలు లేని 20 బైక్‌లు సీజ్
పొన్నలూరు (ఎన్ టుడే న్యూస్): ప్రకాశం జిల్లా కొండపి సర్కిల్ పరిధిలోని పొన్నలూరు గ్రామం బీసీ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 20 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు.
ఈ తనిఖీల్లో కొండపి సీఐ వై.వి. రమణయ్య, మర్రిపూడి ఎస్‌ఐ సుదర్శన్, పొన్నలూరు ఎస్‌ఐ శివ నాగరాజు, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పొన్నలూరు సెంటర్‌లో అవగాహన ర్యాలీ చేపట్టి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.