BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 07 October 2026, 11:07 pm
Posted by : V శ్రీనివాస్

ఇంటి ఆవరణలో గంజాయి మొక్కల సాగు.. మూడు మొక్కలు స్వాధీనం

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 11:07 PM
44 వీక్షణలు

చెన్నూర్: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ పర్యవేక్షణలో కోటపల్లి ఎస్‌ఐ శివనీతి రాజశేఖర్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ జె. లక్ష్మణరావు పోలీసు సిబ్బందితో కలిసి ఎదుళ్లబందం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుర్గం మహేష్ (33), తండ్రి చంద్రయ్య ఇంటి ఆవరణలో తనిఖీలు నిర్వహించగా అక్కడ గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మహేష్‌ను అదుపులోకి తీసుకుని, ఇంటి ఆవరణలో సాగు చేస్తున్న మూడు మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మొక్కలను వ్యవసాయ శాఖ ఏఈఓ పరిశీలించి అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించినట్లు ఎస్‌ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు మొక్కలు 12 అంగుళాలు, మరో మొక్క 14 అంగుళాల ఎత్తు ఉన్నట్లు పేర్కొన్నారు. మూడు మొక్కల విలువ సుమారు రూ.4,600 ఉంటుందని అంచనా వేసినట్లు పోలీసులు తెలిపారు.

గంజాయి సాగు, విక్రయాలు, రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినప్పుడు ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ రాజశేఖర్ సూచించారు.